Friday 16 October 2015

మైక్రోసాఫ్ట్‌ మాయ!

కంప్యూటర్‌లపై మీరో పరికరాన్ని రూపొందిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పరికరాన్ని 3డీలో చూడడం తెలుసు. అదే పరికరాన్ని సిస్టం టేబుల్‌ పక్కనే పెట్టుకున్నట్టుగా ప్రత్యక్షంగా చూస్తే! అంతేనా... ఇష్టమైన యాంగ్రీ బర్డ్స్‌ గేమ్‌ మొబైల్‌లో ఆడాం. అదే యాంగ్రీ బర్డ్స్‌ గేమ్‌ మీ కళ్ల ముందు ప్రత్యక్షమైతే. బర్డ్స్‌ని మీ చేత్తో పట్టుకుని కావాల్సిన కోణంలో లా.....గి వదిలితే! ఇంకా చెప్పాలంటే... మీకు ఇష్టమైన సినిమాని ఉన్న చోటే ఇంటి గోడపైనే ప్లే చేస్తే! ఇవన్నీ ఎలా సాధ్యం అంటారా? మైక్రోసాఫ్ట్‌ త్వరలోనే అందుబాటులోకి తేనున్న HoloLens పరికరాన్ని ధరిస్తే సరి. వేళ్లని కదలిస్తూ చిత్రంలో మాదిరిగా అన్నీ కళ్లముందే ప్రత్యక్షమయ్యేలా చేయవచ్చు. చేతుల్ని కదుల్చుతూ కనిపించే వాటిల్లో కావాల్సిన మార్పులు చేయవచ్చు. మాట్లాడుతూ వాయిస్‌ కమాండ్స్‌ని అందించొచ్చు.

సాగు నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు స్మార్ట్‌ఫోన్‌ యాప్‌!

వాషింగ్టన్‌: వ్యవసాయ క్షేత్రాల్లో నీటి అవసరాలను పర్యవేక్షించేందుకు సహకరించే అధునాతన స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. నీటి వినియోగానికి సంబంధించిన డిజిటల్‌ చిత్రపటాలను ఈ యాప్‌ సిద్ధంచేస్తుంది. నెబ్రాస్కా, గూగుల్‌, ఇదాహా వర్సిటీల శాస్త్రవేత్తలు దీన్ని ఆవిష్కరించారు. ఈఫ్లక్స్‌ (ఈఈఫ్‌ఎల్‌యూక్స్‌)గా పిలుస్తున్న ఈ యాప్‌ ద్వారా.. ప్రపంచంలో ఎవరైనా తమ పంట పొలాలకు సంబంధించిన నీటి వినియోగ చిత్రపటాలు పొందొచ్చు. మెట్రిక్‌ తాజా సాంతికేతికత ఆధారంగా ఈ యాప్‌ పనిచేస్తుంది. సాగు నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు అమెరికాలోని 15 రాష్ట్రాల్లోని నీటి పారుదల నిర్వాహకులు ప్రస్తుతం దీన్ని ఉపయోగిస్తున్నారు. అంతర్జాలంతో అనుసంధానించిన మొబైల్‌లో ఈ యాప్‌ ద్వారా తమ పొలాలకు సంబంధించిన సమాచారాన్ని రైతులు నేరుగా తెలుసుకునే వీలుంది.

పిల్లలు చక్కగా తినాలంటే...